కాకినాడలోని పలు ఉప కేంద్రాల పరిధిలో వార్షిక మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ ఎన్. ఉదయ భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. తిలక్ వీధి, రామకృష్ణ రైస్ మిల్లు, పాత పోస్టాఫీసు వీధి, మార్కెట్, సినిమారోడ్డు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉందన్నారు.