NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నాటికి సోమశిల జలాశయంలో 72.647 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 3195 క్యూసెక్కుల వరద ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోందన్నారు.