అధిక పింఛను కోసం దరఖాస్తు చేసిన వేతన జీవులు, పింఛనుదారుల వేతన వివరాలు 2025 జనవరి 31లోగా ఫైలింగ్ చేయాలని ఈపీఎఫ్వో వెల్లడించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినట్లు తెలిపింది. తాజాగా విధించిన గడువే తుది అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛను కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది.