దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. రాజ్యాంగ రచయిత బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.