కెనడా గురించి వ్యాఖ్యానిస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పోస్ట్ పెట్టారు. ‘మేము కెనడాకు ఏడాదికి 10 కోట్ల డాలర్ల సబ్సిడీ ఎందుకు ఇస్తున్నామో ఎవరూ చెప్పలేరు.. అర్థం కాదు. చాలా మంది కెనడియన్లు కెనడా 51వ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. దాంతో వారికి పన్నుల భారం తప్పుతుంది. మిలిటరీ రక్షణ దొరుకుతుంది. 51వ రాష్ట్రం అనేది చాలా గొప్ప ఆలోచన’ అంటూ రాసుకొచ్చారు.