MDK: జనవరి నెలలో గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్లో మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ గజ్వేల్ న్యాయమూర్తి ప్రియాంక తీర్పును వెలువరించినట్లు గజ్వేల్ సీఐ సైదా తెలిపారు. జగిత్యాల పట్టణం జాంబాగ్కు చెందిన మహమ్మద్ అక్తర్(44) ఈ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించారు.