KNR: జిల్లాలోని గ్రామీణ మహిళలకు ‘జ్యూట్ బ్యాగ్స్’ తయారీపై ఇవ్వనున్న ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరితేదీ అని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 14 రోజులపాటు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల మహిళలు అర్హులన్నారు.