టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో పి. మహేష్ బాబు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నయా అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రాబోతుందట. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.