ప్రకాశం: మర్రిపూడి చెరువు కట్ట వద్ద కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సైడ్ మార్జిన్ లోదిగి ఇరుక్కుపోయింది. దీంతో రాకపోకలు స్థంబించాయి. ఈ మార్గంలో బస్సులు, స్కూల్ వ్యాన్లు ఆగిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా వర్షాలతో రోడ్లు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.