కోనసీమ: ఇటీవల గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందిన వాడపల్లి దేవస్థానం మాజీ ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం పరామర్శించారు. ఆదివారం వెదిరేశ్వరంలో గల రమేష్ స్వగృహానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతిని తెలియజేశారు.