KDP: సీకే దిన్నే మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారుల జాబ్ కార్డ్ e-KYC ప్రక్రియను శనివారం ఏపీడీ ఆజాద్ పరిశీలించారు. ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించి కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా e-KYC పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా KYC పూర్తి చేసుకోవాలన్నారు.