సత్యసాయి: పెనుకొండలో బీజేపీ నాయకులు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల సింగిల్ డైరెక్టర్ పూల గంగాధర్ పాల్గొని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు మండల కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. అనంతరం పెనుకొండలో స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని స్టిక్కర్ అతికిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.