BPT: థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్–2026 అథ్లెటిక్స్ పోటీల్లో బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 5 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ విజేతలను అభినందించి, పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెడల్స్‌తో ఘనంగా సత్కరించారు.