PLD: ఈపూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని ఆరేపల్లి ముప్పాళ్ల, కొండ్రముట్లలోని వైన్ షాపుల్లో సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆరేపల్లి ముప్పాళ్లో సెవెన్ హిల్స్ వైన్స్లో రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపులు నిర్వహించాలని సూచించారు.