AKP: పారిశుధ్య పనులు నిర్వహణకు పాయకరావుపేట మండలానికి 8 ట్రాక్టర్ తొట్టెలను ప్రభుత్వం సరఫరా చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. గతంలో వీటికి ట్రాక్టర్ ఇంజన్లను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. పీఎల్ పురం, అరట్లకోట, పెంటకోట, పెదరామభధ్రపురం, మంగవరం, శ్రీరాంపురం, పాల్మన్ పేట గ్రామాలకు వీటిని కేటాయించామని ఆయన వెల్లడించారు.