అన్నమయ్య: తంబళ్లపల్లి మండలంలో నకిలీ మద్యం కేసులో మాజీ టీడీపీ ఇంఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన డ్రైవర్ అష్రఫ్ సహా మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. మొదట 14 మందిపై కేసు నమోదు చేయగా, ఒకరి సమాచారంతో మరో 9 మందిని చేర్చారు.