NDL: సంజామల మండలం పేరుసోమల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం పర్యటించారు. పేరుసోమల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు.