W.G: నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను మంత్రి దుర్గేష్ బుధవారం తెలిపారు. పెరవలిలో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, ఆనందకరమైన జీవితం రావాలని ఆకాంక్షించారు.