KRNL: బస్టాండ్‌ను కలెక్టర్ ఏ. సిరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజర్వేషన్ కౌంటర్లు, టాయిలెట్లు, డార్మిటరీ, ఉచిత త్రాగునీటి కేంద్రం, షాపులు, హోటళ్లుతో పాటు భద్రతా విభాగాల పనితీరును ఆమె దగ్గరగా పరిశీలించారు. ప్రయాణీకులతో స్వయంగా మాట్లాడి సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్టాండ్‌లో శుభ్రత, సేవల నాణ్యత, భద్రతపై అధికారులకు సూచించారు.