VSP: జిల్లాలో పీడీఎస్ అమలులో ఎలాంటి లోపాలు ఉండరాదని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. జనవరి పంపిణీని కచ్చితంగా, సమయానికి నిర్వహించాలని సూచించారు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ కార్డు దారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సరుకుల రవాణాపై కఠిన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.