KRNL: ఏసుక్రీస్తు జన్మదినం మానవాళికి శుభసూచకమని నగర పాలక సంస్థ ఇంఛార్జి కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అన్నారు. మంగళవారం కేఎంసీ కార్యాలయంలో కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పండుగలు స్నేహభావానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. అనంతరం అధికారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.