ప్రకాశం: పొదిలిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ శంకర్ రావు తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. కండక్టర్‌కు హాల్ టికెట్ చూపిస్తే సరిపొతుందన్నారు.