NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పడమర గాలి గోపురం నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ముందుగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.