E.G: జిల్లా డ్వామా (DWMA)లో జిల్లా విజిలెన్స్ అధికారిగా ఆర్.విజయరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కీర్తి చేకూరిని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. విజిలెన్స్ అధికారి బాధ్యతలు ఎంతో కీలకమని, విధి నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.