VZM: విజయనగరం నగరపాలక సంస్థకు స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు-2024 అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంస్థ ఇందుకు సంబంధించి సిల్వర్ అవార్డును ప్రకటిస్తూ ఆహ్వానం పంపింది. ఈనెల 20వ తేదీన విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో కమిషనర్ నల్లనయ్య పాల్గొని సిల్వర్ అవార్డును స్వీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ వర్గాలు ఈ ప్రకటన విడుదల చేశాయి.