శ్రీకాళహస్తిలో ఓ దుండగుడు బీరు సీసాతో టిప్పర్ డ్రైవర్ గొంతు కోశాడు. స్థానికుల సమాచారం మేరకు.. చెన్నైకు చెందిన చిన్నరాజ్ శ్రీకాళహస్తిలో క్రషర్ ట్రిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టిఫిన్ చేస్తుండగా ఓ వ్యక్తి తన సెల్ ఫోను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రతిఘటించిన తనపై దుండగుడు బీరు సీసాతో గొంతు కోసి పరారయ్యాడు.