VZM: బొబ్బిలి ఎంపీడీఓ పి. రవికుమార్ శుక్రవారం స్థానిక మెట్టవలసలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలలో తీసిన పూడికలను ట్రాక్టర్లతో బయటకు తరలించారు. కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం రోడ్లు, కాలువలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని ప్రజలను కోరారు.