బాపట్ల: చీరాల వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు శనివారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సూరేపల్లి సుబ్బారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐగా పనిచేస్తూ ఆయన బదిలీపై చీరాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని, అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తానని తెలిపారు.