SS: రామగిరి(మం) పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం పరిశీలించారు. పేరూరు–భానుకోట ప్రధాన రహదారి నుంచి శివపురం కొట్టాల గ్రామంలోకి రూ.90 లక్షల NREGS నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఆమె పరిశీలించారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.