VZM: నెల్లిమర్ల సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా శుక్రవారం ఉదయం10 గంటల నుంచి 4 గంటల వరకు నగర పంచాయతీలో నెల్లిమర్ల, జరజాపుపీట, మొయిద, కొండగుంపాం, పూతికపేట, గరికపీట, చింతలపీట గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఈఈ త్రినాధ రావు గురువారం తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.