CTR: సదుం జెడ్పీ ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు గురువారం నిర్వహించారు. 40 అంశాలలో అండర్ 14, 17 విభాగాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్లు హెచ్ఎం సుబ్రమణ్యం తెలిపారు. 300 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నట్లు చెప్పారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానానికి ఎంపికయిన వారు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్‌కు హాజరవుతారని వివరించారు.