GNTR: రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లా నంబూరు – మంగళగిరి (4 లైన్లు), తెనాలి – నిడుబ్రోలు (రెండు) సెక్షన్లలో రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి భూసేకరణ గెజిట్ విడుదలైంది. ప్రస్తుతం ఉన్న లెవల్ క్రాసింగ్ల స్థానంలో ఈ బ్రిడ్జిలు రానున్నాయి. దీనివల్ల ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.