ATP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు పడతాయని రేకులకుంట వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో పంట నూర్పిడి పనులు చేపట్టిన రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.