అన్నమయ్య: ఆఫర్లు, డిస్కౌంట్లు కోసం అమూల్యమైన మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వెబ్సైట్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.