NLR: కావలి అగ్నిమాపక స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మైనంపాటి సుధాకర్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మైనంపాటి సుధాకర్ ఇటీవల విధులకు సెలవు పెట్టి కారులో హైదరాబాదుకు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.