సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు విజయవంతంగా సాగుతున్నాయని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు 4.24 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అన్నారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, 5,500 మందితో పోలీసులు భద్రత కల్పిస్తున్నామని వివరించారు.