అన్నమయ్య: నవంబర్ నుంచి వేరుశనగను నీటి ఆధారిత పంటగా సాగు చేయవచ్చని MS శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కలకడ మండలంలోని కోనగుడిబండ గ్రామంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రైతులతో మాట్లాడుతూ.. అధిక దిగుబడుల కోసం ఎకరానికి 25 కేజీల కాంప్లెక్స్ ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం విత్తన శుద్ధి కోసం లీటరు నీటికి 6 మి.మి క్లోరి పరిపాస్ కలిపి విత్తు నానబెట్టాలన్నారు.