VSP: గాజువాకలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన ముదునూరు మోహన్ రాజు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఓ లాడ్జిలో ఉన్న ఆయన ఎంతకీ బయటకు రాకపోవడంతో ఇవాళ హోటల్ సిబ్బంది పరిశీలించంగా ఉరివేసుకున్నట్లు తెలిపారు.