NRPT: మక్తల్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ శ్రీనివాసులు (37)కు తీవ్ర గాయాలయ్యాయి. ఊట్కూర్ మండలం ఎడివేల్లి గ్రామానికి చెందిన ఆయన మరికల్ నుంచి గ్రామానికి వెళ్తుండగా జక్లేర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని మక్తల్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.