ప్రకాశం: పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి స్వామి అన్నారు. ఇందులో భాగంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తూ సామాన్య ప్రజలకు మేలు చేకూర్చిందన్నారు.