ATP: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే పరిటాల సునీత కలిశారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం – ఎగువపల్లి రోడ్డు (20 కి.మీ)ను డబుల్ లేన్‌గా విస్తరించి, బలోపేతం చేసేందుకు ఐఎస్సీ పథకం కింద రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.