GNTR: చిత్తూరు జిల్లా దేవళపేటలో డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఫిరంగిపురం శాంతిపేట సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహానికి గురువారం పాలాభిషేకం చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు గోవిందయ్యను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, ఈ చర్య వెనుక ఉన్న పెద్దలందరినీ కూడా పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.