VZM: కేంద్ర ప్రభుత్వం GST తగ్గించి నేటికి 18 రోజులైనా పాతధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా స్టేషనరీ వస్తువులైన నోటుబుక్స్, ఎక్సర్సైజ్,గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ నోటుబుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ తదితర వస్తువులను 12% నుంచి 0% చేసినా కొన్నిచోట్లు పాత ధరలతోనే అమ్ముతున్నారు. దీంతో పేద విద్యార్థులకు GST ప్రయోజనం చేకూరడం లేదు.