SKLM: కోటబొమ్మాళిలోని నిమ్మాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని శనివారం ఆయన కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. టి.వి. బాలమురళీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లాలోని పలు విషయాలను ఇరువురు కాసేపు చర్చించారు.