KRNL: దేవనకొండ మండలం కరివేములలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ.. గ్రామంలో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వారం రోజుల క్రితం హుస్సేని ఇంటిలో 4 తులాల బంగారం, కిలో వెండి చోరీ కాగా.. 3 రోజుల క్రితం నాగన్న, చంద్రన్న ఇళ్లలో చోరీ చేశారు. ఈ ఘటనలు మరువకముందే నిన్న రాత్రి కటిక నర్సొజి ఇంటిలో 5 తులాల బంగారం, కిలోన్నర వెండి, కొంత నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.