JN: దేవరుప్పుల మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ పోరాటాలను కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ కాసర్ల రాజు, గ్రామ ఇన్ఛార్జ్ జీపీఓ అంబాల శ్రీధర్ గౌడ్, అజీముద్దీన్ తదితరులున్నారు.