SKLM: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలాసలో కేంద్రీయ విద్యాలయానికి ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దసరా సందర్భంగా పలాస ప్రాంతానికి ఇది గొప్ప కానుక అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల తరుపున కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.