NDL: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆదోని మండలం, సంతేకూడ్లూర్ గ్రామంలో ఘనంగా వేడుకలు జరిగాయి. KVPS మాజీ గ్రామ కార్యదర్శి సిద్ధప్ప సంఘం జెండాను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో KVPS మండల ప్రధాన కార్యదర్శి బి.తిక్కప్ప, గ్రామ కమిటీ అధ్యక్షులు రాముతో పాటు పలువురు కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.