KRNL: జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతిని పురస్కరించుకొనున్నారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ సమాజం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.