ATP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.